క్రిస్మస్ వేడుకల్లో విషాదం..11 మందిని బలిగొన్న కొబ్బరి వైన్
- December 24, 2019
ఫిలిప్పీన్స్ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం జరిగింది. కొబ్బరి వైన్ తాగి 11 మంది చనిపోగా, మరో 300 మందికిపై అస్వస్థతకు లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిలిప్పీన్స్ దేశంలోని దక్షిణ మనీలాలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అన్ని రకాల మద్యాన్ని పంపిణీ చేశారు. ఇలాంచి వాటిలో కొబ్బరి వైన్ కూడా ఒకటి. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో కొందరు కొబ్బరి వైన్ తాగారు. అలా తాగినవారిలో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నగర మేయర్ ఆదేశానుసారం వీరిలో చాలా మందికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. గత గురువారం నుంచి నిన్నటి వరకు ఈ మరణాలు సంభవించాయని మేయర్ తెలిపారు.
వాస్తవానికి ఈ వైన్‌కు ఫిలిప్పీన్స్‌లో మంచి ఆదరణ ఉంది. అందువల్లే ప్రతి ఫంక్షన్‌లో ఈ వైన్‌ను తప్పకుండా పంపిణీ చేస్తుండటంతో మద్యంబాబులు కూడా విరివిగా స్వీకరిస్తుంటారు. అయితే, మిథనాల్ వంటి వాటిని ఈ వైన్‌కు కలుపుతుండటంతో... ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల అక్కడ 21 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







