టీవీ సెలబ్రిటీ చెఫ్ మృతి..పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడి
- December 24, 2019
తిరువనంతపురం (కేరళ): టీవీ ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. జాగీ జాన్ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.జాగీ జాన్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెప్పారు.టీవీ సెలబ్రిటీ చెఫ్ అయిన జాగీజాన్ అనుమానాస్పద స్థితిలో మరణించిందని, మంగళవారం ఆమె మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం చేపిస్తామని తిరువనంతపురం పోలీసులు చెప్పారు.పోస్టుమార్టం తర్వాతే జాగీజాన్ మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







