ఇండిగో బంపరాఫర్: రూ.899కే డొమెస్టిక్, రూ.2,999కే ఇంటర్నేషనల్ టిక్కెట్!

- December 24, 2019 , by Maagulf
ఇండిగో బంపరాఫర్: రూ.899కే డొమెస్టిక్, రూ.2,999కే ఇంటర్నేషనల్ టిక్కెట్!

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు బంపరాఫర్ ప్రకటించింది. కొత్త సేల్ కింద డొమెస్టిక్ విమానాల్లో కనీస ఛార్జ్ రూ.899, అంతర్జాతీయ రూట్లలో కనీస ఛార్జ్ రూ.2,999 ప్రకటించంది. ఈ ఆఫర్ సోమవారం (డిసెంబర్ 23) ప్రారంభమైంది. డిసెంబర్ 26వ తేదీ (గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది. ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్ (The big fat IndiGo sale) పేరిట ఈ ఆఫర్ నాలుగు రోజులు అందిస్తోంది.

డిసెంబర్ 23 ఉదయం గం.6 నుంచి అమలులోకి వచ్చిన ఈ ఆఫర్ 26వ తేదీ రాత్రి గం.11.59 నిమిషాలకు ముగుస్తుంది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండిగో వెబ్‌సైట్, యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్‌) లేదని తెలిపింది.

'2019 ముగుస్తోంది. కానీ మా అద్భుతమైన ఆఫర్లు మాత్రం ముగియడం లేదు. మేము మీ కోసం మీకు అందుబాటులో లేదా సరసమైన ధరలకే టిక్కెట్లు విక్రయిస్తున్నాము. జీరో కన్వీనియెన్స్ ఫీజు ఉంటుంది. వెంటనే బుక్ చేసుకోండి' అని కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com