దుబాయ్‌లో 75 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

- December 24, 2019 , by Maagulf
దుబాయ్‌లో 75 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

75 కిలోల మెథాంఫెటమైన్‌ని కారు స్పేర్‌ పార్ట్స్‌లో దాచి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తుల్ని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. జెబెల్‌ అలి పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ డాక్యుమెంట్స్‌ ప్రకారం నిందితులంతా ఆసియా జాతీయులేనని తేలింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా ఈ ఆటో స్పేర్‌ పార్ట్స్‌ని దుబాయ్‌కి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుల్ని న్యాయస్థానం యెదుట హాజరుపరిచారు. యూఏఈ వెలుపల వున్న వ్యక్తికి చెందిన వస్తువులుగా స్పేర్‌ పార్ట్స్‌ గురించి ఓ నిందితుడు విచారణలో అంగీకరించాడు. కంటెయినర్‌ని రిసీవ్‌ చేసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి చెప్పిన మేరకు దాన్ని తాము అందుకునేందుకు వెళ్ళినట్లు నిందితులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com