భారత్- ఒమన్ మధ్య సముద్ర రవాణా ఒప్పందం
- December 25, 2019
ఒమన్:భారత్-ఒమన్ మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. సముద్ర రవాణా రంగంలో సాయం చేసుకునేలా రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి యూసుఫ్ బిన్ అలవి బిన్ అబ్ధుల్లా అగ్రిమెంట్ పేపర్స్ పై సంతాకాలు చేశారు. 2017లో భారత్ లో పర్యటించిన యూసుఫ్ బిన్ అలవి బిన్ అబ్ధుల్లా ఆహ్వానం మేరకు ప్రస్తుతం ఒమన్ పర్యటనకు జయశంకర్ వచ్చారు. ఈ పర్యటనలో ఆయన పలువురు ఒమనీ మంత్రులు, కీలక అధికారులతో సమావేశం అవుతారు. అలాగే మస్కట్ వేదికగా ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం అవుతారు.
భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్ దేశాల్లో ఒమన్ కూడా కీలక దేశం. రెండు దేశాల భౌగోళిక పరిస్థితులు, హిస్టరీ, కల్చర్ లో సారుప్యత ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత మెరుగయ్యేలా దోహదపడుతోంది. 2018లో భారత ప్రధాని మోదీ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అయ్యాయి. ఒమన్ కు ఇండియా టాప్ ట్రేడింగ్ పార్ట్ నర్ గా ఉంది. 2018-19 రెండు దేశాల మధ్య US$5 బిలియన్ల ట్రేడింగ్ జరిగింది.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







