9000 ఉచిత మీల్స్: దుబాయ్ న్యూ వరల్డ్ రికార్డ్
- December 25, 2019
దుబాయ్:బెయిట్ అల్ ఖాయిర్ సొసైటీ మరియు దుబాయ్ ఇఎ్వస్ట్‌మెంట్ కంపెనీ సంయుక్తంగా 8,997 ఉచిత మీల్స్‌ని లో ఇంకమ్ వర్కర్స్‌కి అందించడం ద్వారా సరికొత్త వరల్డ్ రికార్డ్‌ని సృష్టించడం జరిగింది. కేవలం మూడు గంటలోనే ఈ అరుదైన ఘనత సాధించారు. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ ఆపర్క్ ఈ ఫంక్షన్‌ని నిర్వహించింది. లో ఇంకమ్ వర్కర్స్ (తక్కువ ఆదాయం గల కార్మికులు) కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బెయిట్ అల్ ఖాయిర్ సొసైటీ డైరెక్టర్ జనరల్ అబ్దీన్ తహెర్ అల్ అవధి మాట్లాడుతూ, సమాజంలో తమవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మొదట 7,500 మీల్స్‌ని 8 గంటల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారనీ, అయితే కేవలం 52 నిమిషాల్లోనే 8,997 మీల్స్‌ని పంచి పెట్టగలిగారని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికార అడ్యుడికేటర్ ప్రవీణ్ పటేల్ చెప్పారు. పంపిణీ చేసిన ఆహార పదార్థాలన్నీ చాలా నాణ్యమైనవని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







