కొన్ని గంటలు నేను మెమొరీ లాస్ అయ్యాను: బ్రెజిల్ అధ్యక్షుడు

- December 25, 2019 , by Maagulf
కొన్ని గంటలు నేను మెమొరీ లాస్ అయ్యాను: బ్రెజిల్ అధ్యక్షుడు

ఒకప్పుడు గతం మర్చిపోతే ఇబ్బంది. కానీ, ఇప్పుడు గతం మర్చిపోతే చాలా బాగుంటుంది. గతం మర్చిపోయే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. సామాన్య వ్యక్తులు గతం మర్చిపోతే వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి తప్పించి పెద్దగా ఇబ్బందులు ఉండవు. అదే ఒక దేశానికీ అధ్యక్షుడు ఉన్నట్టుండి కొన్ని కారణాల వలన గతం మర్చిపోతే ఇంకేమైనా ఉన్నదా...? దేశం పాలన మొత్తం అతని చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అతని చేతుల్లోనే ఉంటుంది. దేశం అంధకారంలోకి వెళ్తుంది.

ఇలాంటి ఘటనే బ్రెజిల్ లో జరిగింది. బ్రెజిల్ దేశాధ్యక్షుడు బొల్సోనారో గత సోమవారం రాత్రి తన ప్యాలెస్ లోని బాత్ రూమ్ లో కాలుజారి పడిపోయాడట. తలకు దెబ్బతగడంతో కొన్ని గంటల పాటు గతం మర్చిపోయారు. హుటాహుటిన ఆయన్ను సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. మంగళవారం వరకు తిరిగి గతం గుర్తుకు రావడం మొదలుపెట్టింది. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నార్మల్ గా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు.

2018 లో జరిగిన ఎన్నికల సమయంలో అయన కత్తిపోట్లకు గురయ్యాడు. నాలుగుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి అయన తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com