స్కూల్‌ బస్‌కి ప్రమాదం: నలుగురికి గాయాలు

- December 26, 2019 , by Maagulf
స్కూల్‌ బస్‌కి ప్రమాదం: నలుగురికి గాయాలు

సౌదీ అరేబియా:స్కూల్‌ బస్‌ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని కీలలు వ్యాపించడంతో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. అందులో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా వుందని అధికారులు పేర్కొన్నారు. అసీర్‌ సిటీలోని మఘాసా బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన జరిగిన వెంటనే పోలీస్‌ పెట్రోల్‌ కార్స్‌, సివిల్‌ డిఫెన్స్‌ మరియు అంబులెన్స్‌లు ప్రమాద స్థలికి చేరుకుని, గాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాయపడ్డవారంతా బాలికలేనని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com