2020 లో 'వాట్సాప్' అదిరిపోయే ఫీచర్లు
- December 26, 2019
ప్రపంచవ్యాప్తంగా వాట్పాప్‌కు ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. ఈరోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒకరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే కచ్చితంగా వాట్సాప్ వాడుతుంటారు. ఇక ఈరోజుల్లో వాట్సాప్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. మెసేజ్ ల నుంచి ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్ వంటి కొత్త కొత్త మార్పులను తీసుకొచ్చింది. ఎన్నో ఫీచర్స్‌తో రోజురోజుకీ అప్డేట్ అవుతూ యూజర్స్ మనసు గెలుచుకుంటోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు 300 మిలియన్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.
అయితే ఇదివరకే ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఫేస్బుక్ సొంత యాప్.. 2020లో మరిన్ని టాప్ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ టాప్ ఫీచర్లను కొత్త ఏడాదిలో వరుసగా రిలీజ్ చేయనుంది. వాట్సాప్ ఒక్కో ఫీచర్‌ను ముందుగా బీటా మోడ్‌లో ప్రవేశపెట్టి టెస్టింగ్ చేస్తుంది. ఆ తర్వాతే స్టేబుల్ వెర్షన్లో ఫీచర్లను రిలీజ్ చేయనుంది. ఈ కొత్త ఏడాదిలో వాట్సాప్ అందించబోయే టాప్ ఫీచర్లు ఏంటంటే.. ఎప్పటినుంచో వాట్సాప్ ఈ డార్క్ మోడ్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది. ముందుగా iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
అయితే బీటా వెర్షన్ రిలీజ్ అయ్యే ఈ ఫీచర్ లో కొన్ని క్రిటికల్ ఎలిమెంట్స్ కనిపించవు. WaBetaInfo ప్రకారం.. డార్క్ మోడ్ ఫీచర్ రెడీగా ఉంది. కానీ, Status Updates cell, Profile వంటి అప్ డేట్స్ వంటి ఎలిమెంట్స్ కనిపించవు. సెట్టింగ్స్ కింద కనిపించే కాంటాక్ట్, స్టోరేజీ లిస్ట్ సెల్స్, Backup సెక్షన్ అప్ డేట్స్ కనిపించవు. ఇక ఫోన్ నెంబర్‌తో పాటు About, Contact Infoలోని సెక్షన్లో బిజినెస్ వివరాలు సైతం Inactive మోడ్ లో ఉంటాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







