సలాలా, అలెగ్జాండ్రియాలకు సీజనల్‌ విమానాల్ని పెంచనున్న ఎతిహాద్‌

- December 27, 2019 , by Maagulf
సలాలా, అలెగ్జాండ్రియాలకు సీజనల్‌ విమానాల్ని పెంచనున్న ఎతిహాద్‌

ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, అబుదాబీ నుంచి సలాలా, ఒమన్‌ అలాగే అలెగ్జాండ్రియా, ఈజిప్ట్‌లకు జూన్‌ 25 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్య అదనంగా సర్వీసుల్ని నడపనుంది. ఈ ఏడాది ఈ రూట్స్‌లో సాధించిన సక్సెస్‌తో, వచ్చే ఏడాది సర్వీసుల్ని పెంచడంతోపాటు, సీజన్‌ని 3 వారాలపాటు పెంచడానికి అలాగే ఐదవ వీక్లీ సర్వీస్‌ని ప్రవేశపెట్టడానికీ నిర్ణయం తీసుకున్నట్లు ఎతిహాద్‌ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మంగళ, గురు, శని అలాగే ఆదివారాలతోపాటు శుక్రవారం కూడా విమానాలు ప్రయాణమవుతాయి. ఎయిర్‌బస్‌ ఎ320 విమానాల్ని ఈ మార్గాల్లో నడుపుతారు. వారానికి 26 విమానాల్ని ఒమన్‌కి నడుపుతారు. అందులో మస్కట్‌కి 21, సలాలాకి 5 విమానాలుంటాయి. ఈజిప్ట్‌కి మొత్తం 33 విమానాలు నడుపుతారు. అందులో 28 కైరోకి, ఐదు అలెగ్జాండ్రియాకి నడుపుతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com