కువైట్‌:సిక్‌లీవ్‌తో విదేశాలకు వెళితే, అరెస్ట్‌

- December 28, 2019 , by Maagulf
కువైట్‌:సిక్‌లీవ్‌తో విదేశాలకు వెళితే, అరెస్ట్‌

కువైట్‌:ఉద్యోగులు సిక్‌ లీవ్‌లో వుండగా విదేశాలకు వెళితే, వారు తిరిగి రాగానే అరెస్ట్‌ తప్పదని అధికారిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. తమకు తెలిసిన డాక్టర్ల ద్వారా కొందరు వ్యక్తులు సిక్‌ లీవ్స్‌ని సులభంగా పొందుతున్నారనీ, ఈ నేపథ్యంలో మినిస్ట్రీస్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అండ్‌ హెల్త్‌ ఓ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని అధికారులు పేర్కొన్నారు. డాక్టర్లు లేదా ఉద్యోగులు ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు వుంటాయి. సిక్‌ లీవ్స్‌కి సంబంధించి బ్యాక్‌ డేటెడ్‌ పత్రాల జారీపై నిషేధం వుంటుంది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com