ఇండియా:జనవరి 1 నుంచి పెన్షనర్లకు శుభవార్త..
- December 28, 2019
ఇండియా:ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ కమ్యూటేషన్ లేదా అడ్వాన్స్ పార్ట్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను మళ్లీ తీసుకురావాలని ఈపీఎఫ్‌వో గతంలో నిర్ణయించింది. తాజాగా కార్మిక శాఖ దాని అమలుకు ఓకే చెప్పడంతో జనవరి 1 నుంచి ఈ ప్రయోజనం మళ్లీ అందుబాటులోకి రానుంది. 2009కి ముందు వరకు ఈ ఆప్షన్ ఉంది. మధ్యలో కొంత కాలం ఈ ఆప్షన్‌ను కార్మిక శాఖ వెనక్కు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ అమల్లోకి రానుంది.
రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తం పెన్షన్ రూపంలో అందజేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి స్థాయి పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు మీకు నెలకు రూ.35,000 పెన్షన్ వస్తుందనుకుంటే.. కమ్యూటేషన్ పద్దతిలో అయితే రూ.29.000 వస్తుంది. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే పెన్షన్ పూర్తి విలువను 15 ఏళ్ల తరువాత పునరుద్దరించడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!