బహ్రెయిన్:డ్రగ్స్ కేసులో విచారణ ప్రారంభం
- December 28, 2019
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు, 3,000 నార్కోటిక్ పిల్స్‌తో పట్టుబడ్డ జిసిసి జాతీయుడి కేసు విచారణని ప్రారంభించింది. అరబ్ దేశం నుంచి వచ్చిన ట్రాన్సిట్ విమానం ద్వారా ప్రయాణించిన నిందితుడు, నార్కోటిక్ పిల్స్‌తో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. అతన్ని పరిశీలించగా, నార్కోటిక్ పిల్స్ లభ్యమయ్యాయి. కాగా, 5,000 సౌదీ రియాల్స్ మొత్తానికి నార్కోటిక్ పిల్స్‌ని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుడిపై అభియోగాలు నిరూపితమైతే భారీ జరీమానాని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వదేశంలో వాటి ఖరీదు 20,000 వరకూ వుంటుందనీ, అందుకే తాను ఈ ఒప్పందం కుదుర్చుకున్నాననీ చెబుతున్నాడు. అయితే, నార్కోటిక్ పిల్స్‌ని వ్యక్తిగత వినియోగం కోసమే తాను తీసుకెళుతున్నట్లు నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







