అబుదాబి:మంత్రాల పేరుతో బురిడికొట్టిస్తున్న ప్రవాసీయురాలి అరెస్ట్
- December 29, 2019
అబుదాబి:మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న మహిళను అబుదాబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అజ్ణాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు విదేశీ మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన మంత్ర తంత్ర పూజలతో కుటుంబ సమస్యలు, మానసిక రోగాలు తొలగిపోతాయని ప్రవాసీయురాలు అమాయకులను నమ్మించేది. వారి నుంచి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసేది. సోషల్ మీడియా ద్వారా సమస్యల్లో ఉన్నవారిని ట్రాప్ చేసేది. ఆ తర్వాత అబుదాబిలోని తన అపార్ట్మెంట్ ఫ్లాట్ కు క్లైయింట్స్ ని రమ్మని పిలిపించుకొని..తన మంత్ర విద్యలతో మానసిక రోగాలు, ఫామిలి ప్రాబ్లమ్స్ ను మటుమాయం చేస్తానని చెప్పేది. అయితే..ప్రవాసీయురాలి మోసాలపై గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఆపార్ట్మెంట్ కు వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరైనా మంత్రాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. తాంత్రిక పూజలతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా మంత్రతంత్రాలను నమ్మొద్దని సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!