వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

- December 30, 2019 , by Maagulf
వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అధిక చలి కారణంగా ఓ వృద్ధురాలు మరణించింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలితీవ్రత తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిష్టాబాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. అలాగే.. న్యాల్‌కల్‌లో 5.5, సిర్పూర్‌లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక.. కోస్తాంధ్రలో సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు తగ్గిన ఉష్ణోగ్రతలు. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com