అనుమానిత లింక్స్‌ని క్లిక్‌ చేయొద్దు

- December 30, 2019 , by Maagulf
అనుమానిత లింక్స్‌ని క్లిక్‌ చేయొద్దు

యూఏఈ: యూఏఈ రెసిడెంట్స్‌కి యూఏఈ టెలికామ్‌ రెగ్యులేటర్‌ అథారిటీ (టిఆర్‌ఎ), అనుమానిత లింక్స్‌ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. ట్విట్టర్‌ ద్వారా ఈ విషయమై ప్రజల్ని అప్రమత్తంగా వుండాలని కోరింది టిఆర్‌ఎ. మోసపూరిత ఆలోచనలతో మాల్‌వేర్‌ లింకుల్ని కొందరు ప్రచారంలోకి తీసుకొస్తున్నారనీ, వాటిని గనుక క్లిక్‌ చేస్తే కంప్యూటర్లు, స్మార్ట్‌ డివైజెస్‌లోని డేటా తస్కరణకు గురయ్యే అవకాశముందనీ, ఫ్రాడ్స్‌ చేసేవారు ఆ మాల్‌వేర్స్‌ ద్వారా, బ్యాంక్‌ అకౌంట్లలోని డబ్బుల్ని తస్కరించేందుకూ అవకాశం వుంటుందని టిఆర్‌ఎ పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్స్‌ చేసుకోవాల్సి వుంటుందనీ, దేన్నయినా డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు ఆ లింక్‌ల పట్ల అప్రమత్తత తప్పనిసరి అని టిఆర్‌ఎ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com