15న మకరజ్యోతి దర్శనం
- December 30, 2019
రెండు రోజుల క్రితం మండల పూజలు ముగిసిన అనంతరం మూసుకున్న కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు నేడు మకర విళక్కు కోసం తెరచుకోనున్నాయి. సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి గర్భాలయాన్ని అధికారులు తెరవనున్నారు. ఈ సంవత్సరం జనవరి 15న మకర సంక్రమణం జరుగనున్నందున, ఆ రోజునే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ పూజారులు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కోరింది. ఆపై ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు