లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి

- December 30, 2019 , by Maagulf
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేస్తోన్న ఆసియా జాతీయుడైన ఉద్యోగి ఒకరు, అంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్‌ని పూర్తి చేసేందుకు సదరు ఉద్యోగి లంచం తీసుకోవడానికి ముందుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, అధికారుల నుంచి అందుకున్న సమాచారం మేరకు నిందితుడైన ఉద్యోగిని అరెస్ట్‌ చేశారు. అరబ్‌ జాతీయుడైన ఓ ఉద్యోగి, అధికారులకు ఈ అవినీతిపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com