జనవరిలో ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం

- December 30, 2019 , by Maagulf
జనవరిలో ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం

మస్కట్‌: అల్‌ షర్కియా ఎక్స్‌ప్రెస్‌ వే మీద ట్రాఫిక్‌ని వచ్చే నెల నుంచి (జనవరి) అనుమతించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పేర్కొంది. జనవరి 20న ఈ హై వే మీద వాహనాల ప్రయాణాలు ప్రారంభమవుతాయి. మొత్తం 181 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూపొందించారు. బిద్‌బిద్‌ నుంచి అల్‌ అకాక్‌ మీదుగా అల్‌ కామిలి అల్‌ వాఫి వరకు ఈ మార్గం రూపుదిద్దుకుంది. మూడు నెలలపాటు ఈ రోడ్డుపై పరిశీలన వుంటుంది. పరిశీలన ప్రారంభమయ్యాక హెవీ వెహికిల్స్‌ని కూడా అనుమతిస్తారు. అయితే పెట్రోకెమికల్స్‌, ప్రమాదకరమైన మెటీరియల్స్‌ని తీసుకువెళ్ళే వాహనాల్ని మాత్రం ఈ రహదారిపై అనుమతించరు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com