ఒమన్:833 మంది లేబర్ లా వయోలేటర్స్ పై బహిష్కరణ వేటు

- December 31, 2019 , by Maagulf
ఒమన్:833 మంది లేబర్ లా వయోలేటర్స్ పై బహిష్కరణ వేటు

ఒమన్:కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 833 మంది కార్మికులపై ఒమన్ ప్రభుత్వం బహిష్కరణ వేటు విధించింది. డిసెంబర్ 1 నుంచి 28 మధ్య అధికారులు నిర్వహించిన ఇన్స్ పెక్షన్ క్యాంపేన్ లో పలు ప్రాంతాల్లో లేబర్ లా వయోలేషన్ జరిగినట్లు గుర్తించారు. డిసెంబర్ 1 నుంచి 20 మధ్య నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో 644 మంది కార్మికులను అరెస్ట్ చేయగా..డిసెంబర్ 21 నుంచి 28 మధ్య 189 మందిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ నెలలో వివిధ ప్రాంతాల్లో అరెస్టైన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి..

డిసెంబర్ 1 : అల్ ఖువెర్ లోని పబ్లిక్ పార్కింగ్ లో ఇల్లీగల్ గా వాహనాలను క్లీన్ చేస్తున్న 13 మంది వర్కర్స్ ని ఇన్స్ పెక్షన్ టీం అధికారులు అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 2 : బౌషర్, ముత్రా ఏరియాల్లోని పబ్లిక్ పార్కింగ్ లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను క్లీన్ చేస్తున్న 61 మంది వర్కర్స్ ని మినిస్ట్రీ టీం అరెస్ట్ చేసింది.
డిసెంబర్ 10 : మావెలెలోని ఫ్రూట్స్ & వెజిటెబుల్స్ మార్కెట్లో ఇన్స్ పెక్షన్ టీం తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 43 మందిని అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 16 : సీబ్ లోని విలాయత్ లో మొబైల్ ఫోన్స్ అమ్ముతున్న 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్ 21 : మ్యాన్ పవర్ మినిస్ట్రీ అధికారులు, మస్కట్ మున్సిపాలిటీ అధికారులతో కలిసి సంయుక్తంగా సీబ్‌లోని అల్ ఖౌద్, నార్త్ అల్ హెయిల్ & మాఅబెలాలో  సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో పండ్లు, కూరగాయలు, టోబాకో అమ్ముతున్న 18 మంది పట్టుబడ్డారు.
డిసెంబర్ 26: మస్కట్, సిదాబ్, బస్తన్ ఏరియాలో చేపట్టిన తనిఖీల్లో ఏడుగురు మహిళలలో 66 మంది కార్మికులను అరెస్ట్ చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు వీళ్లందరిపై ఒమన్ ప్రభుత్వం బహిష్కరణ వేటు విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com