దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

- December 31, 2019 , by Maagulf
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

బహ్రెయిన్‌: ముహరాక్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం డైరెక్టరేట్‌ పోలీస్‌, ఇద్దరు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులు, ఓ ప్రత్యేకావసరాలు గల వ్యక్తిని అటకాయించి, అతని వద్ద నుంచి డబ్బు అలాగే బ్యాక్‌ కార్డుల్నీ దొంగిలించినట్లు అధికారులు వెల్లడించారు. బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ఇద్దరు అనుమానితుల్ని పట్టుకున్నారు. తొలుత ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, అతని దగ్గరనుంచి లభించిన సమాచారంతో ఈ కేసులో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేస్తామని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com