లాయల్టీ టువార్డ్స్‌ వైఫ్‌: భారీ జరీమానా చెల్లించిన వ్యక్తి

- December 31, 2019 , by Maagulf
లాయల్టీ టువార్డ్స్‌ వైఫ్‌: భారీ జరీమానా చెల్లించిన వ్యక్తి

బహ్రెయిన్‌: తన భార్య హౌస్‌లోన్‌ పొందేందుకోసం తన ఇంటిని ఓ వ్యక్తి తాకట్టు పెట్టగా, ఆ తర్వాత ఇద్దరి మధ్యా తలెత్తిన విభేదాలతో, ఇద్దరూ విడిపోవడం, ఈ క్రమంలో ఆ భార్య, బ్యాంకు నుంచి తీసుకున్న లోన్‌ చెల్లించకపోవడం, చివరికి ఆ భర్త బ్యాంకు లోను చెల్లించలేని స్థితిలో ఇంటిని అమ్మేయాల్సి రావడం జరిగింది. ఐదేళ్ళలో సదరు మహిళ లోన్‌ మొత్తం చెల్లించాల్సి వుండగా, చెల్లించేది లేదని చేతులెత్తేసింది. ఈ క్రమంలో బాధిత వ్యక్తికి బ్యాంకు నుంచి నోటీసులు వెళ్ళాయి. జైలు తప్పదన్న ఆందోళనతో బాధితుడు, ఆ ఇంటిని విక్రయించి, బ్యాంకుకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com