జీతాలు చెల్లించలేదు.. పైగా 'తొలగింపు' హెచ్చరికలు

- January 02, 2020 , by Maagulf
జీతాలు చెల్లించలేదు.. పైగా 'తొలగింపు' హెచ్చరికలు

కువైట్‌ సిటీ: 200 మంది కార్మికులకు ఓ కంపెనీ జీతాలు చెల్లించకపోగా, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌తో కాంట్రాక్ట్‌ వున్న కంపెనీ కార్మికుల తరఫున లేబర్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ - ఎంప్లాయ్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ సెక్టార్‌ వద్ద ఫిర్యాదు చేయడం జరిగింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించనుంది. అథారిటీ ఈపీఎస్‌, సదరు కంపెనీ రిప్రెజెంటేటివ్స్‌కి ఈ విషయమై ఇప్పటికే సమన్లు కూడా పంపినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ముగిసిన తర్వాత తమతో కంపెనీ బార్గెయినింగ్‌కి దిగిందనీ, 900 దిర్హామ్‌లు ఇచ్చి, ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతిస్తామని ఆ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారనీ, లేదంటే దేశం వదిలి వెళ్ళాలని హెచ్చరిస్తున్నారని కార్మికులు వాపోయారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని తాము గతంలోనే పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌కి ఫిర్యాదు చేశామని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com