అబుధాబి వీదుల్లో పిల్లలు ఆటలు ఆడకూడదు
- January 17, 2016
వీదుల్లో ఆటఆడే బాలల కారణంగా రోడ్లపై పలు ప్రమాదాలు జరుగడానికి వారి క్రీడా పరికరాలు పరోక్ష కారణమవుతున్నాయని ప్రజా సంబంధాల శాఖ, ట్రాఫిక్ మరియు పెట్రోలింగ్ విభాగపు డైరెక్టర్ కల్నేల్ జమేల్ సేలం అల్ అమెరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమేరేట్స అంతా ఇటీవల ప్రాచుర్యం పొందిన విద్యుత్ బ్యాటరీతో నడిచే రెండు చక్రాల స్కూటర్
పిల్లలకు వినోదం పెద్దలకు ఆందోళన కల్గిస్తున్నాయి. వీటిని నడుపుతున్న పిల్లలు నేరుగా వీధుల్లోకి వచ్చి వేగంగా వాటితో చక్కర్లు కొడుతున్నారు. ఈ కారణంగా ప్రమాదాల సంఖ్య నానాటికీ అబుధాబిలో అధికమవుతున్నారని అన్నారు. జనావాసాల్లో, వీధుల్లో ఈ తరహ ఇకపై ఆడనివ్వకుండా, ప్రమాదం లేని మంచి నాణ్యత గల ఆట పరికరాలు వారి తల్లితండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే , విద్యుత్ బ్యాటరీతో నడిచే రెండు చక్రాల స్కూటర్ పై చైతన్యం కలిగి ఉండాలని , వాటికి ఏ మాత్రం చార్జింగ్ తగ్గినా బ్రేకులు పడవనే సంగతి గ్రహించాలని కోరారు. ప్రమాదాల నివారణకు రక్షణ కల్గించే ప్రత్యేక దుస్తులను ధరించాలని కోరారు, బాలలు సురక్షకరమైన ప్రదేశాలలో క్రీడా మైదానాలలో ఆడే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజా సంబంధాల శాఖ, ట్రాఫిక్ మరియు పెట్రోలింగ్ విభాగపు డైరెక్టర్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







