మిచిగాన్:ఊహించనంత లక్..2020 టిప్ ఛాలెంజ్ ఆమె జీవితాన్నే మార్చేసింది
- January 03, 2020
మిచిగాన్:న్యూ ఇయర్. చాలా మంది జీవితంలో జస్ట్ కేలండర్ మాత్రమే మారుతుంది. కానీ, ఈ న్యూ ఇయర్ మిచిగాన్ లేడీ లైఫ్ నే మార్చేసింది. కొత్త ఏడాది కొత్త జీవితాన్ని గిఫ్ట్ గా అందించింది ఈ ఇయర్. ఆమె పేరు డేనియల్ ఫ్రాంజోని. యూఎస్ మిచిగాన్ స్టేట్ లోని అల్పెనా హోటల్ సర్వర్. 2020 టిప్ ఛాలెంజ్ తో డేనియల్ లైఫ్ అనూహ్యంగా మారిపోయింది. 2019 ఇయర్ ఎండర్ డేస్ లో ఆమె సర్వర్ గా చేస్తున్న హోటల్ కి ఓ జంట వచ్చింది. ఆ కపుల్ ఎదో తినేసి రోటీన్ గానే బిల్ చేప్పేసింది. ఆ తర్వాత బిల్ పేపర్ పై ఎదో రాసిపెట్టి వెళ్లిపోయారు. ఆ కపుల్ ఇచ్చే టిప్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న సర్వర్ లేడీ..వాళ్లు వెళ్లిపోయాక బిల్లు చూసి షాక్ అయ్యింది. హోటల్ లో వాళ్లు చేసిన బిల్లు 23 డాలర్లే. కానీ, బిల్లుతో పాటు 2020 డాలర్లను డేనియల్ కి టిప్ గా ఇచ్చి వెళ్లిపోయారు. కొద్దిసేపు నమ్మలేకపోయింది. తన బాస్ కు విషయం చెప్పి సంతోషం పంచుకుంది. అలా 2020 టిప్ ఛాలెంజ్ లో భాగంగా ఆ కపుల్ డేనియల్ జీవితంలో వెలుగులు నింపింది.
పోయిన సంవత్సరం వరకు డేనియల్ ఫ్రాంజోని జీవితం దుర్భరం. సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలతో సహా ఓ షెల్టర్ లో తలదాచుకునేది. అల్పెనా హోటల్ లో చేరిన తర్వాత కొద్దో గొప్పో సంపాదించి పిల్లలను పోషించుకుంటోంది. అలాంటి పరిస్థితుల్లో బతుకీడుస్తున్న తనకు తన పిల్లల భవిష్యత్తు ఎంటో అర్ధం అయ్యేది కాదని తన గతాన్ని గుర్తుచేసుకుంది డేనియల్. కానీ, హోటల్ లో ఆ జంట తన జీవితంలో మరిచిపోలేని అద్భుతాన్ని మిగిల్చి వెళ్లారని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తాను నాకు సొంత ఇల్లు ఉంది. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది..ఇది అందరి జీవితంలో సాధ్యం కాదంటూ డేనియల్ ఆనందంగా చెబుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!