కువైట్ లో తెలుగు తమ్ముళ్ళ రక్తదానం
- January 17, 2016
తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ 20వ వర్ధంతి పురస్కరించుకొని రక్తదానం చేయాలని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఇచ్చిన పిలుపు మేరకు గల్ఫ్ దేశాల్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు స్వచ్ఛంధంగా రక్తదానం చేసారు.కువైట్లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ ప్రెసిడెంట్ ములకల సుబ్బరాయుడు,జనరల్ సెక్రటరీ ఉదయ్ ప్రకాష్ నేతృత్వంలోని ప్రవాసాంధ్ర టీడీపీ శనివారం రక్తదానం కార్యక్రమం చేపట్టగా పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు జబరియా సెంట్రల్ బ్లడ్ బ్యాంకు, కువైట్ కి వెళ్ళి రక్తదానం చేసారు.సౌదీ అరేబియాలోని దమామ్ మరియు జుబేల్ పారిశ్రామిక ప్రాంతాలలోని కొన్ని కంపెనీల క్యాంపులలో కూడ ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ అభిమానులు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.


తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







