కువైట్ : చెత్తకుప్ప దగ్గర బంగారం సంచి..ఎవరు వదిలేశారు? ఎందుకు వదిలేశారు?
- January 06, 2020గార్బేజ్ కంటేనర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి బంగారం సంచి వదిలివెళ్లిన ఘటన అబు అస్సానియా ప్రాంతంలో చోటు చేసుకుంది. అందులో వేల దినార్ ల విలువైన బంగారం నగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే..ఆ బ్యాగును ఎవరు వదిలేశారు? బంగారం యజమాని ఎవరు? ఎందుకు వదిలేశారో తెల్సుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముబారక్ అల్-కబిర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చెత్త వేసే కంటేయినర్ దగ్గర గోల్డ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్యాగును ఎవరు వదిలివెళ్లారో తెల్సుకునేందుకు సమీపంలోని సీసీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే..ఇంట్లో పని చేసే వర్కర్స్ యజమాని ఇంట్లో చోరీ చేసి ఆ తర్వాత దొరికిపోతామనే భయంతో బంగారం బ్యాగును చెత్త కంటేనర్ దగ్గర పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. యజమానుల ఇళ్లలో చోరీలకు పాల్పడటం తరచుగా జరుగుతున్న ఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు. బహుశా గ్యార్బేజ్ కంటేనర్ వాళ్ల ల్యాండ్ మార్క్ కూడా అయి ఉండొచ్చని..అక్కడ సంచిని వదిలివేసిన తర్వాత గ్యాంగ్ స్టర్స్ లేదా ట్యాక్సీ డ్రైవర్లు బ్యాగును తీసుకెళ్తుంటారని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







