మతిస్థిమితం లేని తల్లికూతుళ్లపై అత్యాచారం..ఎసియన్ వ్యక్తికి లైఫ్ టైం ప్రిసన్
- January 06, 2020
రస్ అల్ ఖైమా: మతిస్థిమితం లేని తల్లికూతుళ్లపై పలుమార్లు అత్యాచారానికి తెగబడిన ఆసియా వ్యక్తికి రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. చీఫ్ జడ్జి జస్టిస్ సమే షకేర్ బెంచ్ నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణకు రావటంతో ఈ మేరకు తీర్పునిచ్చింది. కోర్టు రికార్డుల ప్రకారం.. మతిస్థిమితం సరిగ్గా లేని మహిళ తీరులో మార్పును గమనించిన ఆమె బంధువులు ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు అనుమానించారు. గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేయించటంతో వారి అనుమానమే నిజమైంది. పెళ్లి కాకుండా గర్భవతి అవటంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించటంతో విషయం బయటపడింది. కొన్నాళ్లుగా మహిళను అబ్సర్వ్ చేస్తున్న నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కూతుర్ని కూడా రేప్ చేశాడు. అయితే..నిందితుడు తమపై అత్యాచారం జరుపుతున్న విషయాన్ని కూడా గ్రహించలేని మానసిక స్థితి వాళ్లిద్దరిది. దీంతో పదే పదే అతను దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడిపై అభియోగం నిర్ధారణ కావటంతో రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?