సులేమాని హత్యకు పరతీకారం తీర్చుకుంటా: కుద్స్ యొక్క కొత్త చీఫ్
- January 06, 2020
ఇరాన్: కద్స్ చీఫ్ జనరల్ సులేమాని ని అమెరికా దళాలు హతమొందించిన విషయం తెలిసిందే. సులేమాని మరణంతో ఇరాక్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. కుద్స్ యొక్క కొత్త చీఫ్ గా ఎస్మాయిల్ ఖానీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఇస్మాయిల్, అమెరికాపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ స్టేట్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
"అమరవీరుడు సులేమాని యొక్క మార్గాన్ని కొనసాగిస్తామని మేము వాగ్దానం చేస్తున్నాము, మరియు ఆ అమరవీరులకు ప్రతిగా ఈ ప్రాంతం నుండి అమెరికాను వెళ్లగొట్టటమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని కన్నీ చెప్పారు. ఈ విప్లవంలో కన్నీ తో కలిసి ముందడుగువేసేందుకు సిద్ధమయ్యారు సులైమాని కుమార్తె జైనాబ్. జైనాబ్ మాట్లాడుతూ "తన తండ్రి మరణానికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం..మిడిల్ ఈస్ట్ లో యుఎస్ సైనికుల కుటుంబాలు తమ పిల్లల మరణం కోసం ఎదురుచూస్తూ తమ రోజులు గడుపుతాయి" అన్నారు.
మరోవైపు ఇరాన్/ఇరాక్ చేస్తున్న ప్రతీకార వచనాలకు అమెరికా ఇలా స్పందించింది...అమెరికా దళాలకు వ్యతిరేకంగా టెహ్రాన్ ఏమైనా చర్యలు తీసుకుంటే, అమెరికా గురి పెట్టి ఉంచిన 52 లక్ష్యాలపై ఎటువంటి సంకోచం లేకుండా అధునాతన పరికరాలతో దాడి చేయగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో ప్రతిజ్ఞ చేశారు.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ, టెహ్రాన్లోని ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సులేమాని కోసం జరిగిన రాష్ట్ర అంత్యక్రియల్లో ప్రార్థనలకు నాయకత్వం వహించారు. హత్యకు ప్రతిస్పందనగా ప్రపంచ శక్తులతో 2015 అణు ఒప్పందం యొక్క మిగిలిన పరిమితులను కూడా వదిలివేసినట్లు టెహ్రాన్ తెలిపింది. ఇరాక్ పార్లమెంటు స్పందిస్తూ, అమెరికా దళాలను దేశం నుంచి తొలగించాలని ముక్తకంఠంతో ఓటు వేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు