అబుదాబీ రోడ్లపై టెయిల్‌గేట్‌కి ఆటో సిస్టమ్‌తో చెక్‌

- January 06, 2020 , by Maagulf
అబుదాబీ రోడ్లపై టెయిల్‌గేట్‌కి ఆటో సిస్టమ్‌తో చెక్‌

అబుదాబీ పోలీస్‌, టెయిల్‌ గేట్‌ సమస్యకి ఆటో సిస్టమ్‌తో చెక్‌ పెట్టనున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ ప్రకారం, నిర్ణీత డిస్టెన్స్‌ పాటించని వాహనాలకు జరీమానా విధించబడుతుంది. 400 దిర్హామ్‌ల జరీమానాతోపాటు 4 ట్రాఫిక్‌ పాయింట్లను విధిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆటో సిస్టమ్‌ ద్వారా మానిటరింగ్‌ చేసి, టెయిల్‌ గేట్స్‌కి కారణమయ్యేవారికి జరీమానాలు విధించడం జరుగుతందని అధికారులు పేర్కొన్నారు. అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ఒకటి ఈ మేరకు చేపట్టామనీ, ఈ విధానం ద్వారా టెయిల్‌ గేట్స్‌కి పాల్పడేవారికి ఎస్‌ఎంఎస్‌ వార్నింగ్‌ వెళుతుందని అధికారులు వివరించారు. జనవరి 15 నుంచి జరీమానాలు విధించనున్నట్లు తెలిపారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com