మహిళా ప్రయాణీకురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్
- January 07, 2020యూఏఈ: ఆసియాకి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఒకరు, తన క్యాబ్లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడు, కారులోని కెమెరాని డిస్కనెక్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ మీడియా సిటీ ఏరియా ప్రాంతంలో 31 ఏళ్ళ యూరోపియన్ మహిళ, ట్యాక్సీలో దుబాయ్ సిలికాన్ ఒయాసిస్కి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. నిద్రలోకి జారుకున్న ఆమె మెలకువ వచ్చి చూసేసరికి, ఆ కారు నిర్మాణంలో వున్న ఓ భవనం దగ్గర ఆగిందని తెలుసుకున్నారు. ఇంతలోనే డ్రైవర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించగా, డ్రైవర్ని తోసేయడం జరిగింది. అయితే, డ్రైవర్ ఆమెను ఆ తర్వాత ఆమె ఇంటి వద్ద దించినట్లు పోలీసులు వివరించారు. ఎవరికీ ఈ విషయం గురించి చెప్పొద్దని డ్రైవర్, బాధితురాల్ని బెదిరించాడు. ఇంటికి చేరుకున్న ఆమె, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..