మహిళా ప్రయాణీకురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్
- January 07, 2020
యూఏఈ: ఆసియాకి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఒకరు, తన క్యాబ్‌లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడు, కారులోని కెమెరాని డిస్కనెక్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ మీడియా సిటీ ఏరియా ప్రాంతంలో 31 ఏళ్ళ యూరోపియన్ మహిళ, ట్యాక్సీలో దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌కి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. నిద్రలోకి జారుకున్న ఆమె మెలకువ వచ్చి చూసేసరికి, ఆ కారు నిర్మాణంలో వున్న ఓ భవనం దగ్గర ఆగిందని తెలుసుకున్నారు. ఇంతలోనే డ్రైవర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించగా, డ్రైవర్‌ని తోసేయడం జరిగింది. అయితే, డ్రైవర్ ఆమెను ఆ తర్వాత ఆమె ఇంటి వద్ద దించినట్లు పోలీసులు వివరించారు. ఎవరికీ ఈ విషయం గురించి చెప్పొద్దని డ్రైవర్, బాధితురాల్ని బెదిరించాడు. ఇంటికి చేరుకున్న ఆమె, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!