బహ్రెయిన్‌లో యూఏఈ ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్
- January 07, 2020
యూఏఈ ఎక్స్ఛేంజ్, సిట్రాలోని అల్ ఖర్జియాలో తన కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. యూఏఈ ఎక్స్ఛేంజ్ అఫీషియల్స్, ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పర్ జీజీసీసీ రీజినల్ హెడ్ వర్గీస్ పి మాథ్యూ, కంట్రీ హెడ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ నైన్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ బహ్రెయిన్, కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్ అనీ, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ విషయంలో అగ్రగామిగా వున్నామని ఆకాష్ నైన్వాల్ చెప్పారు. సిట్రా అనేది తమకు ప్రామినెంట్ కస్టమర్ బేస్ అనీ, ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభంతో వినియోగదారులకు మరింత సులభతరమైన విధానంలో వారి వారి అవసరాలు తీరుతాయని నిర్వాహకులు తెలిపారు. గ్లోబల్ రీచ్ పరంగా 170కి పైగా దేశాలు తమ నెట్‌వర్క్‌లో వున్నాయనీ, 150 మిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ 2018లో జరిపామనీ, 115 బిలియన్ యూఎస్ డాలర్స్ లావాదేవీలు నిర్వహించామని మాథ్యూ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?