భారత దేశవ్యాప్తంగా నేడు కేంద్ర కార్మిక సంఘాల సమ్మె
- January 08, 2020
భారత కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా తలపెట్టిన సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఈ సమ్మెకు INTUC, AITUC, HMS, CITU తదితర సంఘాలు తమ మద్దతు తెలిపాయి. జనవరి 2, 2020న జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కేంద్ర కార్మికశాఖ విఫలమైందనీ, దీంతో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత సమ్మె చేపడుతున్నామని 10 కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
విద్యాసంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. దీనితో పాటు 175కు పైగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతో గ్రామీణ భారత్ పేరుతో సమ్మెకు మద్దతిస్తునట్లు ప్రకటించాయి. ఈ సమ్మె కారణంగా ఇవాళ పలు రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రవాణా రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాంక్ యూనియన్లు ముందుగానే ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేశాయి.
మోదీ సర్కారు ప్రభుత్వ సంస్థలను నిర్వీ ర్యం చేస్తోందని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. 12 ఎయిర్‌పోర్టులను ఇప్పటికే అమ్మేశారని, ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని కార్మిక సంఘాలు దుయ్యబట్టాయి. రైల్వేలలోనూ ప్రైవేటీకరణ మొదలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశా రు. బీపీసీఎల్‌ను కూడా అమ్మేస్తున్నారని, ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ విలీనం తర్వాత 93 వేల 600 మంది టెలికాం కార్మికులు వీఆర్ ఎస్ పేరుతో ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. వీటితో పాటు 49 రక్షణ ఉత్పత్తుల తయారీ యూనిట్ల కార్పొరేటీకరణ, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







