షిప్‌యార్డులో ఉద్యోగావకాశాలు..

- January 08, 2020 , by Maagulf
షిప్‌యార్డులో ఉద్యోగావకాశాలు..

గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించింది . ఈ గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఆఫర్ చేస్తున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి .

మొత్తం ఖాళీలు : 43 పోస్టులు .. అవేమిటంటే .. అసిస్టెంట్‌ మేనేజర్‌ , ఆఫీస్‌ అసిస్టెంట్‌ , మెరైన్‌ ఫిట్టర్‌ , వెల్డర్ . ఈ ఉద్యోగాలకు ఆయా ఉద్యోగాన్ని బట్టి అర్హతలు ఉన్నాయి . కొన్నింటికి పదోతరగతి , మరికొన్నింటికి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ , డిగ్రీ , ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత అవసరం . కొన్ని ఉద్యోగాలకు అనుభవం అవసరం .

రాతపరీక్ష , ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు . దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ . ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది : ఫిబ్రవరి 04, 2020. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసేవారు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది : ఫిబ్రవరి 15, 2020. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ : https://goashipyard.in/ ను పరిశీలించొచ్చు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com