అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న ఎన్టీఆర్..
- May 18, 2015
మే 20న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఎన్టీఆర్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. స్టార్ల బర్త్‌డేలకు మాములుగా వారు నటిస్తున్న చిత్రాల ఫస్ట్‌లుక్‌లు కానీ సినిమా ప్రారంభోత్సవాలు కానీ చేసి అభిమానులను అలరిస్తారు. ఎన్టీఆర్ మాత్రం అభిమానులను ఆనందపర్చడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎన్టీఆర్, ప్రణతిలకు నాలుగు నెలల క్రితం కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. కొడుకు పేరు అభయ్ రామ్ అని ప్రకటించిన ఎన్టీఆర్ ఆ జూనియర్‌ను ఎప్పుడూ అభిమానులకు చూపించలేదు. అభయ్‌రామ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఫోటో బయటకు విడుదల చేయలేదు. కాబట్టి ఎన్టీఆర్ తన పుట్టినరోజునాడు (మే20) అధికారికంగా అభిమానుల కోసం సోషల్ మీడియాలో కొడుకు అభయ్ రామ్ ఫోటోలను విడుదల చేయాలనుకుంటున్నాడట. ఇది నందమూరి అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్త అని చెప్పొచ్చు. టెంపర్ సక్సెస్‌తో జోరుమీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో 'మా నాన్నకు ప్రేమతో' అనే సినిమా కోసం రెడీ అవుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









