రోడ్డు ప్రమాదంలో రెండేళ్ళ చిన్నారి మృతి

- January 08, 2020 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో రెండేళ్ళ చిన్నారి మృతి

దుబాయ్‌:రెండేళ్ళ వయసున్న ఎమిరేటీ చిన్నారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఓ వాహనం బలంగా ఆమెను ఢీకొనడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దుబాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా ఖాదిమ్‌ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులతో వెళుతున్న ఆ చిన్నారి ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి సకాలంలో వాహనాన్ని ఆపలేకపోయాడనీ, దాంతో యాక్సిడెంట్‌ చోటు చేసుకుందనీ, తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, ఆమె ప్రాణాలు కోల్పోయిందని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com