మెక్సికోలో ఘోర ప్రమాదం..21 మంది మృతి
- January 08, 2020
మెక్సికో:మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో రైలు వేగానికి బస్సు రెండుగా తునాతునకలైంది. తమావుపాలిస్ రాష్ట్రంలోని అనాహుక్ టౌన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద స్టాప్ లైట్ ను బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. బస్సులో 40 మంది ప్రయాణికులకు మాత్రమే అవసరమైనన్ని సీట్లు ఉన్నప్పటికీ 60 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే బస్సు డ్రైవర్ గాయాలతో బతికి బయటపడినట్టు సమాచారం. ఈ యాక్సిడెంట్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







