ఆస్ట్రేలియా బుష్ ఫైర్:సహాయక చర్యల కోసం 200 మంది వాలంటీర్లను పంపించనున్న యూఏఈ

- January 09, 2020 , by Maagulf
ఆస్ట్రేలియా బుష్ ఫైర్:సహాయక చర్యల కోసం 200 మంది వాలంటీర్లను పంపించనున్న యూఏఈ

అబుదాబి: బుష్ ఫైర్ క్రైసిస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆస్ట్రేలియాకు యూఏఈ ఆపన్నహస్తం అందించనుంది. ఆస్ట్రేలియాలో సహాయక చర్యల కోసం 200 మంది వాలంటీర్లను పంపించేందుకు యూఏఈ నిర్ణయించింది. ఈ మేరకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్డ్మ్ ఫోర్స్ డిప్యూటీ సూప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జియాద్ నెహ్యాన్ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మెరిసన్ తో చర్చించారు. అడవులను కాల్చేస్తున్న కార్చిచ్చు సివియారిటీ గురించి ఆయన అడిగి తెల్సుకున్నారు. బుష్ ఫైర్ ను ఎదుర్కునేందుకు సమర్ధులైన నిపుణులను, ఈక్విప్మెంట్, మ్యాన్ పవర్ పింపించేందుకు యూఏఈ సిద్ధంగా ఉందని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు అండగా
నిలబడతామని స్కాట్ మెరిసన్ కు షేక్ మొహమ్మద్ తెలిపారు.

యూఏఈ రెడ్ క్రెసెంట్ అగ్నిప్రమాదాల సమయాల్లో మంటలను అదుపుచేయటంతో పాటు నష్ట తీవ్రతను తగ్గించటంతో ఎక్స్ పర్ట్ టీం. ఈ టీం ఆస్ట్రేలియా మంటలను, దట్టమైన పొగను ఎదుర్కొని ఎలా మంటలను అదుపు చేయాలో తగిన ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తుంది. పచ్చటి అడవులను సైతం బూడిద చేసే ఇలాంటి కార్చిచ్చు చెలరేగినప్పుడు మంటల కంటే ఊపిరిసలపనంత దట్టంగా వ్యాపించే పొగతోనే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నెల రోజులకు పైగా అడవుల్లో రాజుకున్న బుష్ ఫైర్ కారణంగా ఆస్ట్రేలియాలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కొల్పోయారు. వేల సంఖ్యలో ఇళ్లు బూడిదయ్యాయి. దాదాపు 50 కోట్ల మూగజీవాలు బుష్ ఫైర్ ధాటికి చనిపోయాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com