విడాకులు కావాలన్న భార్య విన్నపాన్ని తిరస్కరించిన హై షరియత్ కోర్టు
- January 09, 2020
బహ్రెయిన్:తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ యాభై ఏళ్ల మహిళ చేసుకున్న విన్నపాన్ని హై షరియత్ కోర్టు తిరస్కరించింది. భర్త తనను చిత్రహింసలు పెడుతున్నాడని, అవమానిస్తున్నాడని ఆరోపిస్తూ విడాకులు కావాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే..ఆరోపణలు నిరూపించటంతో ఆమె తగిన సాక్ష్యాలను మాత్రం చూపించలేకపోయింది. దీంతో కుటుంబ సంక్షేమం, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా విడాకుల విన్నపాన్ని తిరస్కరిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
డైవోర్స్ కోరిన జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లల సంరక్షణకు కుటుంబం ఒక్కటిగా ఉంటేనే మంచిదని, విడాకులు మంజూరు చేయటం అంటే పిలల్ల భవిష్యత్తును రిస్క్ లోకి నెట్టడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. భర్త తరపు వాదనలు వినిపంచిన లాయర్..తన క్లైయింట్ తన శ్రమను, సంపాదనను అంతా ఫ్యామిలి కోసమే కేటాయిస్తున్నట్లు కోర్టుకు వివరించాడు. అతని కోసం దాచుకుంది ఏమి లేదని స్పష్టం చేశాడు. అయితే..తనను గదిలో బంధిస్తున్నాడన్న భార్య ఆరోపణలను భర్త తరపు లాయర్ కొట్టిపారేశారు. అతను లేని సమయంలో ఎటైనా వెళ్లాలని అనుకుంటే ముందుగా తనకు ఇన్ఫామ్ చేయాలని మాత్రమే కోరినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఇలాంటి రిక్వెస్ట్ లు మన సొసైటీ సాధారణమేనని కూడా కోర్టుకు వివరించాడు. భర్త తరపు వాదనలతో ఏకీభవించిన కోర్టు విడాకుల కావాలన్న భార్య విన్నపాన్ని తిరస్కరించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







