భారత్ ను 'శాంతిదూత' పాత్ర వహించాలి అంటూ కోరిన ఇరాన్

- January 09, 2020 , by Maagulf
భారత్ ను 'శాంతిదూత' పాత్ర వహించాలి అంటూ కోరిన ఇరాన్

తమ దేశానికి, అమెరికాకు మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో వీటిని తగ్గించడానికి ఇండియా ' శాంతిదూత ' పాత్ర వహించాలని ఇరాన్ కోరింది. సహజంగా ప్రపంచంలో శాంతి, సామరస్యాల కోసం కృషి చేసే దేశాల్లో ఇండియా ఒకటని, ఉద్రిక్తతల నివారణకు ముఖ్యంగా తమకు మిత్ర దేశమైన భారత్ చొరవ తీసుకోవాలని ఆ దేశ రాయబారి అలీ చెగెనీ అభ్యర్థించారు. ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమాన్ మృతి అనంతరం అమెరికాతో వైషమ్యం పెరిగిన పరిస్థితుల్లో ఇక దీనికి చెక్ చెప్పేందుకు ఇండియా ముందుకు రావాలన్నారు. సులేమాన్ మృతికి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఆయనకు నివాళి అర్పించిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడారు. మేము యుధ్ధాన్ని కోరడంలేదు..' ఈ ఖండంలో ప్రతి దేశం శాంతి, సామరస్యాలతో ఉండాలన్నదే మా అభిమతం ' అన్నారాయన. ఇరాక్ లోని అమెరికన్ సైనిక స్థావరాలపై తమ దేశం జరిపిన మిసైల్ దాడులను సమర్థించిన ఆయన.. ఆత్మరక్షణ కోసం తాము చేబట్టిన ఈ చర్య తమ హక్కు అని పేర్కొన్నారు. ఇలా ఉండగా.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల ఇరాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో ఫోన్ లో మాట్లాడి రెండు దేశాలూ ఉద్రిక్తతల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com