కొత్త వీసా పాలసీలతో పెరుగుతున్న పర్యాటకులు
- January 09, 2020
రియాద్: వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని వివిధ దేశాలకు విస్తరించడం ద్వారా టూరిజం సెక్టార్ సౌదీ అరేబియాలో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని బిజినెస్ ఇన్‌సైడర్స్ వెల్లడిస్తోంది. స్థానిక టూర్ ఆపరేటర్ ఘాజి అల్ ఒనైజి మాట్లాడుతూ టూరిస్ట్ వీసాల్లో మార్పుల నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య 200 శాతం పెరిగిందని చెప్పారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టూరిజం సెక్టార్‌లో వృద్ధి 300 శాతం వరకు వుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. 45 దేశాలకు చెందిన టూరిస్టులతో తాను మాట్లాడాననీ, వారంతా ఇంకోసారి సౌదీలో పర్యటించాలనే ఆసక్తిని వెలిబుచ్చారని చెప్పారాయన. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ వెల్లడించిన వివరాల ప్రకారం 90 రోజుల పాటు కింగ్‌డమ్‌లో టూరిస్టులు స్టే చేయొచ్చనీ, ఈ పీరియడ్‌లో వారు మల్టిపుల్ టైమ్స్ కింగ్‌డమ్‌లోకి ఎంటర్ అవ్వొచ్చని తెలిపింది. మొత్తం 49 దేశాలకు చెందిన టూరిస్టులు ఇ-వీసా ఆన్‌లైన్ విధానం ద్వారా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు