మాస్క్‌ దగ్గర్లో బాలుడిపై దుబాయ్‌ కార్మికుడి లైంగిక వేధింపులు

- January 09, 2020 , by Maagulf
మాస్క్‌ దగ్గర్లో బాలుడిపై దుబాయ్‌ కార్మికుడి లైంగిక వేధింపులు

ఆసియా వర్కర్‌ ఒకరు, దుబాయ్‌లోని అల్‌ కుసైస్‌ 3లో 8 ఏళ్ళ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్‌ 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు తన సైకిల్‌కి సమస్య రావడంతో సాయం కోరగా, నిందితుడు ఆ బాలుడ్ని లైంగికంగా వేధించాడు. బాలుడు తన ఇంటికి వెళ్ళి జరిగిన ఘటన గురించి తల్లితో చెప్పడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు, ఆ బాలుడ్ని సరదాగా కొట్టడం జరిగింది తప్ప ఎలాంటి లైంగిక వేధింపులకూ పాల్పడలేదని విచారణలో పేర్కొన్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com