దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా 'ప్రవాసీ భారతీయ దివస్'వేడుకలు

- January 10, 2020 , by Maagulf
దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా 'ప్రవాసీ భారతీయ దివస్'వేడుకలు

దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియన్ అంబాసిడర్ పవన్ కపూర్ 
ముఖ్య అతిధిగా విచ్చేసారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.ప్రవాసీ భారతీయులను ఉద్దేశించి పవన్ కపూర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 2019 ప్రవాసీ భారతీయ అవార్డు గ్రహీతలు సురేందర్ కాంధారి(గురుద్వారా-చైర్మన్),జులేక దావుద్(జులేక హెల్త్ కేర్ గ్రూప్ (ఫౌండర్ మరియు చైర్మన్),వాసు షరాఫ్(ప్రముఖ పారిశ్రామివేత్త),గిరీష్ పంత్(సోషల్ వర్కర్)లకు పవన్ కపూర్ మెమెంటో అందజేశారు.

ఈ నెల 12 నుంచి దుబాయ్ లోని ఇండియన్ కాన్సూలెట్ లో తత్కాల్ పాస్ పోర్ట్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో దుబాయ్ తో పాటు నార్తర్న్ ఎమిరేట్స్ లోని ప్రవాస భారతీయులు ఒకే రోజులో పాస్ పోర్ట్ పొందవచ్చు. మధ్యాహ్నం 12 గంటల లోపు పాస్ పోర్టుకు అప్లై చేసుకుంటే సాయంత్రం 6.30 గంటల వరకల్లా పాస్ పోర్ట్ అందిస్తామని దుబాయ్ కాన్సులేట్ లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో కాన్సుల్ జనరల్ విపుల్ ప్రకటించారు. తత్కాల్ పాస్ పోర్టులను అత్యవసర పరిస్థితుల్లో అందించనున్నారు. తాత్కాల్ పాస్ పోర్టు కోసం బుర్జ్ దుబాయ్ లోని అల్ ఖలీజ్ సెంటర్ లో ఉన్న BLS ఇంటర్నేషనల్ ఔట్ సోర్సింగ్ లో అప్లై చేసుకోవాలని విపుల్ తెలిపారు.

తత్కాల్ స్కీం కింద జారీ 36 పేజీలు ఉన్న పాస్ పోర్ట్ కు 855 దిర్హామ్ లు, 60 పేజీల పాస్ పోర్టుకు 950 దిర్హామ్ లు చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యూలర్ పాస్ పోర్ట్ లకు అయితే 36 పేజీలకు 285 దిర్హామ్ లు, 60 పేజీల పాస్ పోర్టుకు 380 దిర్హామ్ లు చెల్లించాల్సి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com