దుబాయ్‌ రెసిడెంట్స్‌,ఈ నెంబర్‌ నుంచి వచ్చే కాల్స్‌ని ఆన్సర్‌ చేయొద్దు

- January 10, 2020 , by Maagulf
దుబాయ్‌ రెసిడెంట్స్‌,ఈ నెంబర్‌ నుంచి వచ్చే కాల్స్‌ని ఆన్సర్‌ చేయొద్దు

దుబాయ్:ఎమిరేట్స్‌ ఐడీ అథారిటీ నుంచి వస్తున్నట్లుగా చెబుతున్న ఓ ఫోన్‌ కాల్‌, ఆయా వ్యక్తుల బ్యాంక్‌ అకౌంట్ల నుంచి డబ్బు మాయమవడానికి కారణమవుతోంది. దుబాయ్‌ రెసిడెంట్‌ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ, ఓ ఫోన్‌ కాల్‌ తనకు వచ్చిందనీ ఎమిరేట్స్‌ ఐడీకి సంబంధించిన వివరాల్ని వెరిఫై చేస్తున్నామని చెప్పారని తెలిపారు. వివరాలు చెప్పిన తర్వాత తన ఫోన్‌ నెంబర్‌కి వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వచ్చిందనీ, దాన్ని ఆ వ్యక్తితో పంచుకోగానే, తన బ్యాంక్‌ నుంచి డబ్బుని అవతలి వ్యక్తి విత్‌డ్రా చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో తన బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు లేవని చెప్పారు ఆ వ్యక్తి. తన అనుభవం గురించి వివరిస్తూ ఇతరులెవరూ ఈ ట్రాప్‌లో పడొద్దని ఆ వ్యక్తి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com