స్ప్రింగ్ సీజన్ క్యాంప్:ప్రవాసీయులకు టెంట్లు అద్దె ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు

- January 11, 2020 , by Maagulf
స్ప్రింగ్ సీజన్ క్యాంప్:ప్రవాసీయులకు టెంట్లు అద్దె ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు

కువైట్:స్ప్రింగ్ క్యాంప్ లో టెంట్ల అద్దెపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. టెంట్లు ఎవరెవరికి అద్దెకు ఇవ్వాలనే అంశంపై కువైట్ మున్సిపాలిటి ఆధ్వర్యంలోని స్ప్రింగ్ క్యాంప్ కమిటీకి ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటీవ్ అసోసియేషన్ విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అసోసియేషన్ కోసం కేటాయించిన టెంట్లను ప్రవాసీయులకు అప్పజెప్పటంపై ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రవాసీయులకు టెంట్లను అద్దెకు ఇచ్చేందుకు సొసైటీస్ ఏ మాత్రం సంకోచం లేకుండా తిరస్కరిస్తున్నాయని, కేవలం షేర్ హోల్డర్స్ కు మాత్రమే సర్వీస్ అందిస్తామని తేల్చిచెబుతున్నాయని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.

అయితే..టెంట్ల అద్దెపై ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటీవ్ అసోసియేషన్ తీరును స్ప్రింగ్ క్యాంప్ కమిటీ తప్పుబట్టింది. క్యాంప్ లో టెంట్లను సిటిజన్స్, ప్రవాసీయులకు సర్వీస్ అందించేందుకు మాత్రమే సొసైటీలకు లైసెన్స్ ఇచ్చామని, అసొసేషన్ షేర్ హోల్డర్స్ కి లీజ్ ఇవ్వటం కోసం కాదని స్ప్రింగ్ క్యాంప్ కమిటీ వివరించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అసొసియేషన్లు పబ్లిక్ కు టెంట్లను అద్దెకు ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ హెచ్చరించింది. మున్సిపాలిటీ అధికారాల మేరకు లైసెన్స్ ను క్యాన్సిల్ చేయటమే కాకుండా ఫ్యూచర్లోనూ ఏ సీజన్ లో లైసెన్స్ పొందకుండా బ్లాక్ లిస్టులో పెడుతామని వార్నింగ్ ఇచ్చింది. అలాగే రెంటల్ ఫీపై చర్చించేందుకు ఎండ్ ఆఫ్ సీజన్ లో సమావేశం నిర్వహించున్నట్లు కూడా కమిటీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com