గుడ్ న్యూస్...అబుధాబిలో పూర్తిస్ధాయిలో అందుబాటులోకి కొత్త హాస్పిటల్
- January 12, 2020
అబు ధాబిలోని షేక్ షక్బౌత్ మెడికల్ సిటీలోని కొత్త ఎమర్జ్సీ డిపార్ట్మెంట్ ఇప్పుడు పూర్తిస్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మఫ్రక్ హాస్పిటల్‌లోని ఎమర్జ్సీ డిపార్ట్మెంట్ను పూర్తిగా మూసివేస్తున్నట్టు, ఇకపై ఇక్కడే వైద్యసేవలు అందించబోతున్నట్టు అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ ప్రకటించింది. కొత్త హాస్పిటల్లో ఇన్‌పేషెంట్ వార్డ్ కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మేడికల్ కేర్ రంగంలో స్వచ్చందంగా పనిచేస్తున్న మాయో క్లినిక్‌తో కలిసి యూఏఈలోనే అతిపెద్ద హాస్పిటల్లో పేషెంట్లకు అధునాతన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్లు ప్రకటించారు. వైద్యరంగంలోనే అధునాతన ప్రక్రియల ద్వారా.. 24 గంటలూ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ అందించబోతున్నారు. మొత్తం 723 పడకల ఈ ఆస్పత్రిలో ట్రామా, ఆర్ధోపెడిక్స్, సర్జరీలు.. ఇలా అన్నిటికీ చికిత్స లభిస్తూంది. ఇదే హాస్పిటల్లో రెండు ప్రెసైడెన్షియల్ సూట్లు, 36 వీఐపీ సూట్లు, అధునాతన శస్త్ర చికిత్సాలయం, 18 సర్జికల్ రూంస్, ప్రీమెచ్యూర్ బర్త్ డిపార్ట్మెంట్లు ఉన్నాయని, ప్రజలు పూర్తి స్ధాయిలో ఈ సేవలు వినియోగించుకొవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..