ఇక ఓల్డ్ మోడల్ కార్ డ్రైవర్లకు రెసీడెన్సీ రెన్యూవల్ లేనట్టే!
- January 13, 2020
ట్రాన్స్ పోర్ట్ కంపెనీస్ లో డ్రైవర్స్ ని కంట్రోల్ చేసేందుకు కువైట్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పాత మోడల్ కార్లను నడిపే డ్రైవర్లకు వర్క్ పర్మిట్లను రెన్యూవల్ చేయబోమని లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. 2011 కంటే పాత మోడల్ కార్లను నడిపే డ్రైవర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చింది. ట్రాన్స్ పోర్ట్ కంపెనీస్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్ల రెసిడెన్సీ కూడా రెన్యూవల్ చేసేది లేదని పేర్కొంది. అయితే..హెవీ వెహికిల్స్ డ్రైవర్లకు కొత్త రూల్స్ వర్తించవు. హవీ వెహికిల్స్ ధర ఎక్కువ కనుక..వీటిలో కొత్త వాహనాలు ఉండే ఆస్కారం తక్కువ కనుక హెవీ వెహికిల్స్ ను మినహాయించారు. ఇదిలాఉంటే కొత్త నిబంధనలపై ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న పాత మోడల్ కార్లను ఇప్పటికిప్పుడు అప్ గ్రేడ్ ఎలా చేయమని ప్రశ్నిస్తున్నాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







