కీలక ఉద్యోగులకు షాక్ ఇచ్చిన వాల్‌మార్ట్ ఇండియా
- January 13, 2020
ప్రపంచంలోని అతిపెద్ద రీటైలర్ వాల్‌మార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుర్గావ్లోని ప్రధాన కార్యాలయంలో వందమంది ఉన్నతాధికారులను తొలగించే ప్రక్రియలో ఉంది. టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో మూడింట ఒక వంతు మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం టౌన్హాల్లో సోర్సింగ్, అగ్రి-బిజినెస్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసిజి) విభాగాల్లో వైస్ ప్రెసెడెంట్ సహా కీలక తొలగింపులను కంపెనీ ప్రకటించింది. నష్టాలతో సంక్షోభం పడిన వాల్‌మార్ట్ ఇండియా ఈ చర్యలను చేపట్టనుందని ది ఎకనామిక్ టైమ్స్ కధనం.
వాల్‌మార్ట్ ఇండియా భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఒక దశాబ్దం తరువాత కూడా అమ్మకాలు పెద్దగా పుంజుకోకపోవడంతో, ముంబై కేంద్రాన్ని మూసివేయాలని యోచిస్తోంది. అలాగే అన్ని కొత్త-స్టోర్ విస్తరణలను కూడా నిలిపివేస్తుంది. కొత్త స్టోర్లకు రియల్ ఎస్టేట్ బృందం కూడా రద్దు చేసింది. అయితే ఈ వార్తలపై వాల్‌మార్ట్ ఇండియా ఎంతమందిని తొలగిస్తున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ భారతదేశంలో వ్యాపార వృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. తమ కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని వాల్‌మార్ట్ ఇండియా ప్రతినిధి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇది తొలగింపుల ప్రక్రియలో మొదటి దశ అని, ఏప్రిల్ నాటికి మరిన్ని తొలగింపులుంటాయని ప్రతినిధి తెలిపారు. అయితే వాల్‌మార్ట్ ఇండియా దేశంలో హోల్‌సేల్ విభాగంలో నుంచి నిష్క్రమించే ఆలోచన లేదని, క్యాష్ అండ్ క్యారీ వ్యాపార అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ కామర్స్‌లో భారీపెట్టుబడులు పెడుతున్నామని వాల్‌మార్ట్ ఇండియా వెల్లడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!