ఖతార్ ను వణికించేస్తున్న చలిగాలులు: 10 డిగ్రీల సెల్సియస్ దిగువకు టెంపరేచర్

- January 14, 2020 , by Maagulf
ఖతార్ ను వణికించేస్తున్న చలిగాలులు: 10 డిగ్రీల సెల్సియస్ దిగువకు టెంపరేచర్

దోహా:ఖతార్ ను చలిగాలలు వణికించేస్తున్నాయి. వింటర్ వెదర్ కు వర్షాలు కూడా తోడవటంతో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. మరికొద్ది రోజుల పాటు వెదర్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఖతార్ మెట్రలాజీ డిపార్ట్మెంట్ తెలిపింది. రేపటి నుంచి అకాశం మరింత మేఘావృతం కానుందని, దాంతో రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు మెట్రలాజీ డిపార్మెంట్ అధికారులు చెబుతున్నారు. సముద్ర తీరాల్లో రేపటి వరకు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతాయని, ప్రజలు ఎవరూ సముద్ర తీరానికి వెళ్లకపోవటమే మంచిదని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com